Top News

మాంచి మాటలు

మంచి మాట

మాంచి మాట

నోరు జారిన మాట ,

చేయి జారిన అవకాశం ,

గడిచిపోయిన కాలం ,

మళ్ళీ తిరిగి రాదు.


నోరు

ఇప్పుడు ఉన్న కాలంలో ఒకసారి నోరు జారితే ఆ మాట తిరిగి తీసుకోవడం చాలా కష్టం అందుకోసం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడుకోండి .మాట్లాడండి.

అవకాశం

ఇప్పుడు ఉన్న కాలంలో అవకాశం దొరకడం చాలామందికి కష్టమైపోయింది ఒకసారి అవకాశం దొరికిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం దాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవడం కూడా అంతంత మాత్రమే ఉంది ఒకసారి అవకాశం చేయి జారి పోతే మళ్లీ ఆ అవకాశం దొరకాలంటే కష్టమే మరి.

కాలం

కాలం అనేది ఎలాంటిది అంటే మీరు ఏం చేసినా చేయకపోయినా దాని ప్రవాహం ఆగదు దానికి అదే ముందుకు వెళ్ళిపోతుంటుంది.

 ఒక్కసారి పోయిన కాలాన్ని మళ్లీ మీరు తిరిగి తేలేరు. కాబట్టి ఇప్పుడు మీరు ఈ నిమిషంలో ఏమి చేస్తున్నారు. దాన్ని మీరు గమనించండి ఒకవేళ మీరు ఈ సమయంలో ఏదైనా నేర్చుకోవడానికి, సంపాదించడానికి లేదా భవిష్యత్తులో ఉపయోగ పడే పని ఏదైనా చేస్తున్నారు. అంటే మీరు కాలాన్ని సద్వినియోగం చేస్తున్నారని అనుకోవచ్చు లేదా మీరు ఈ సమయాన్ని వృధాగా గడిపేస్తున్నారంటే వచ్చేకాలంలో మీరు ఈ సమయాన్ని తిరిగి పొందలేరు ఒకసారి గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు ఇది మీరు గమనించండి.

 ఈ కాలం మీరు మళ్ళీ ఎంతగా బ్రతిమాలిన తిరిగి రాదు ఎంత ప్రయత్నించినా తిరిగి పొందలేదు.



Post a Comment

Previous Post Next Post